చేవెళ్లలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. రైతు నిరసన దీక్ష కార్యక్రమం లో కేటీఆర్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇక అటు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా పరిహారం అవ్వాలని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం. ఈ సందర్భంగా హరీ ష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుకు కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతు ధర్నా చేస్తున్నా మన్నారు. బాల్కొండలో పోలీసులు ధర్నాలో పాల్గొనవద్దు అని ప్రజలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
చేవెళ్లలో ప్రారంభమైన రైతు నిరసన..
