కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాడ ఎక్కడ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి బాధ్యతలు చేపట్టిన ఉత్తంకుమార్ రెడ్డి ఒకేసారి కరీంనగర్ సందర్శించి పూలదండలు బొకేలు వేసుకొని జాడ లేకుండా పోయారంటూ ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటూ వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలను మొదలు పెట్టడం లేదన్నారు. రాబోయే వర్షాకాల సీజన్లో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఇన్చార్జి మంత్రిగా సమీక్ష సమావేశాలు లేవన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు తాగునీరు రోజువారి వస్తుండే తాగునీరు ఒకరోజు తప్పి ఒకరోజు వస్తున్న ఇన్చార్జి మంత్రి ఇన్చార్జి చర్యలు లేవని తెలిపారు. కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెంటనే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై చర్యలు చేపట్టాలన్నారు.
జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్ కీలక వ్యాఖ్యలు
