కుర్రకారును షేక్ చేస్తున్న హెబ్బా..

hebha-30.jpg

తోటి హీరోయిన్లతో పోటీ పడటంలో ముందు వరుసలో ఉంటోంది హెబ్బా పటేల్. హాట్ బ్యూటీగా యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన ఈ బ్యూటీ.. వీలు కుదిరిన ప్రతిసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ వదులుతూ కుర్రకారును షేక్ చేస్తున్న ఈ భామ తాజాగా అందాల విందిచ్చింది. ఆన్ లైన్ మాధ్యమాలపై పరువాలు పరిచేసి హాట్ ట్రీట్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. తన అందాలతో తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. అమ్మడికి యూత్ ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశంలో కూడా యూత్‌ ని అట్రాక్ట్ చేస్తూ సొగసుల గాలం వేసింది. కానీ ఏం లాభం.. హెబ్బా అందాల ఆకర్షణ ఆమెకు భారీ హిట్స్ తీసుకురాలేకపోయింది. అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ వచ్చినప్పటికీ కెరీర్ లో పెద్దగా హిట్ పడింది మాత్రం లేదు. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించిన హెబ్బా ఖాతాలో సరైన హిట్ పడలేదు.

Share this post