సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. అనంతరం దుబ్బాకలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలను, స్టేజీ మీదికి ఆహ్వానించారు. వీరితోపాటు కాంగ్రెస్ దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కూడా స్టేజీ మీదికి నిర్వాహకులు ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాల మధ్యనే మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస..
