లవంగాలతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

lavanga-9.jpg

మనం చేసే వంటకాలలో లవంగాలను ఉపయోగిస్తుంటాము. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. దీని వలన చిగుళ్ల సమస్య, దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అయితే, లవంగం నీటిని తాగడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పంటినొప్పితో ఇబ్బంది పడే వారికి ఇది మంచి మెడిసిన్ లా పని చేస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ నీటిని తాగడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. భోజనం చేసిన రెండు గంటలు లవంగం టి తీసుకోవడం వలన మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసనతో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు వారం రోజుల పాటు నాలుగు లవంగాలు నములుతూ ఉండండి. ఇలా చేయడం వలన కొంత కాలానికి మొత్తానికి ఉపశమనం కలుగుతుంది.

Share this post

scroll to top