ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో హస్తినకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన నిర్వహించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు తప్పనిసరిగా పాల్గొనాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీకి కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరవుతున్నారు. ఇందులో భాగంగా పహల్గాంలో టూరిస్టులపై జరిగిన టెర్రర్ అటాక్, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనను నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సీడబ్ల్యూసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచంద్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొననున్నారు.
హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి..
