తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం భేటీ అవుతారు. సిగ్న కంపెనీ సీనియర్‌లతో రేవంత్ చర్చలు జరుపనున్నారు. అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే పలు కంపెనీల ఓనర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐ లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ విజయంలో ఎన్ఆర్ఐల సహకారం ఉందని రేవంత్ పేర్కొన్నారు. పదేండ్లలో వందేండ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ఎన్ఆర్ఐలకు సీఎం వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్యానించారు. అలాగే ఉచితాలపైనా రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ..
