సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఆయన మంత్రి శ్రీధర్‌బాబు తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కు చట్టబద్ధత, కులగణన తో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లులపై చర్చించారు. సెకండ్ ఫేజ్‌లో భాగంగా మెట్రో రైల్ కారిడార్ ను నగర శివారు ప్రాంతాలకు విస్తరించేందుకు చేపడుతోన్న డీపీఆర్‌ను ప్రధానికి సీఎం వివరించారు. అయితే, ఇప్పటికే మెట్రో రైలును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించేందుకు ఇప్పటికే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు.
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ..
