హైదరాబాద్ అభివృద్ధికి కమ్మవర్గం సహకారించాలి..

ntr-20.jpg

ఎంతోమందిని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయన్నారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని కులాన్ని అభిమానిస్తాం ఇతర కులాలను గౌరవిస్తామంటూ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని అది తమ ప్రభుత్వ విధానం కాదంటూ స్పష్టంచేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కమ్మవర్గం సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తమకు నచ్చని విషయాలపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. దాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు తెలియజేశాయన్నారు. తెలుగువారైన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారని అంతా ఆశించామని, కానీ కాకపోవడం నిరాశ కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మసంఘం కోసం గత ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నో లిటిగేషన్లు పెట్టిందని సీఎం రేవంత్ అన్నారు. వాటిని పరిష్కరించడంతో పాటు భవన నిర్మాణానికి కూడా సహకరిస్తుందన్నారు.

Share this post

scroll to top