యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. సచివాలయంలో కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనుంది. అనంతరం సివిల్స్, ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, జూపల్లి, తుమ్మల, కోమటిరెడ్డి, సీఎస్ శాంతి కుమారి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.
కొత్త పథకం సివిల్స్ అభయహస్తం..
