సీఎం రేవంత్ హైడ్రాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చెరువులను ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అద్భుతమైన మూసీ డవలప్ మెంట్ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తాం పేదవాళ్లకు అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నరు. రూపాయిరూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని ఉన్నరు. వారిపట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరిస్తుంది. మూసీ నాలాలో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 11వేల మందికి అక్కడ ఇళ్లు ఉన్నాయి. ప్రతివారికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి వారికి ఇబ్బందిలేకుండా చూస్తామని రేవంత్ పేర్కొన్నారు.
హైడ్రాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు..
