అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో కేసీఆర్ సూచనలు ఇవ్వాలన్నారు రేవంత్. అధికారం ఉంటేనే వస్తా లేదంటే ఫామ్‌హౌస్‌లో పడుకుంటానంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది మెదక్ జిల్లాకు అవసరమైన సాగు, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతుల అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించాం ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల కష్టాలు తీర్చామన్నారు.
కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..
