మొత్తానికి నా కల నెరవేరింది..

ravanth-29.jpg

మూసీ పునరుజ్జీవంపై అతి త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం మీడియా ఛానల్ ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూసీపై ఆల్రేడీ నిర్ణయం తీసుకున్నాం ముందడుగు వేశాం ఇక వెనక్కి తగ్గే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తాం నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గబోం అని అన్నారు. వచ్చే నవంబర్ 1వ తేదీ నుంచి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. బాపూఘాట్ నుంచి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. నవంబర్‌లోపే మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులపై విపక్షాలతో చర్చలకు తాము సిద్ధమని కీలక ప్రకటన చేశారు.

Share this post

scroll to top