లోక్‌సభలో కులాల గొడవ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోదీ మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను కాంగ్రెస్ తీసుకువచ్చింది. కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులంపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. కాగా, లోక్‌సభలో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నా యంగ్, ఎనర్జిటిక్ సహోద్యోగి అనురాగ్ ఠాకూర్ చేసిన ఈ ప్రసంగాన్ని తప్పక వినాలి. వాస్తవాలు, హాస్యంతో కలగలిసిన ఇది ‘ఇండియా’ కూటమి డర్టీ రాజకీయాలను బట్టబయలు చేస్తుంది’ అని అందులో పేర్కొన్నారు.
ప్రధానికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్..
