రేవంత్‌కు 26, కేటీఆర్‌కు 24.. 

cong-24.jpg

కొత్తగా నాలుగు సంక్షేమపథకాలకు జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. లబ్దిదారుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారుల్ని ఉరుకులు పెట్టిస్తోంది. క్షేత్రస్థాయి సర్వే తర్వాత ఈనెల 21 నుంచి గ్రామసభలు నిర్వహిస్తోంది. కానీ సర్కార్ తలపెట్టిన గ్రామసభలు కాస్తా సంగ్రామ సభలుగా మారుతున్నాయి. లబ్దిదారుల జాబితాలన్నీ తప్పుల తడకలేనంటూ అనేక చోట్ల జనం నుంచి ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తుంటే అధికారులకు సినిమా కనిపిస్తోంది. గ్రామసభలైతే జరుగుతున్నాయ్ గాని.. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం జనం ముందుకు ధైర్యంగా వెళ్లలేకపోతున్నారని, ఇచ్చిన హామీల గురించి ప్రజలే నిలదీస్తున్నారని విపక్షం కోరస్ ఇస్తోంది.

ఇదే అదనుగా రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ యాక్షన్లోకి దిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మిగతా అంశాలపై పరిశీలన జరపడం కమిటీ లక్ష్యం. 24 నుంచి నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది కమిటీ టార్గెట్.

Share this post

scroll to top