కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతుందని ప్రకటించిన వెంటనే వాడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అది కూడా ఏకంగా లీటర్ కు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. శనివారం నాడు 115 రూపాయలు ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ అదే రోజు సాయంత్రానికి 130 రూపాయలకు చేరుకుంది. ఇక బయటి మార్కెట్లో 100 రూపాయలు ఉన్న పామాయిల్ ప్రస్తుతం 115 రూపాయలు అయింది. కేంద్ర ప్రభుత్వం సోయా, సన్ ఫ్లవర్, పాం ఆయిల్ పై సుంకం విధిస్తున్నట్లు తెలపగా దుకాణదారులు వెంటనే భారీగా పెంచేశారు. కేవలం వంటలు మాత్రమే కాదు. దీపారాధనకు ఉపయోగించే నూనె కూడా ధరను పెంచేశారు దుకాణదారులు. ఇలా కేవలం దుకాణాల్లో మాత్రమే కాకుండా ఆన్లైన్ లో కూడా విక్రయిదారులు అమాంతం చేశారు. మరి కొందరైతే ఏకంగా నో స్టాక్ బోర్డులు పెట్టేశారు.
కొండెక్కిన వంటనూనె ధరలు..
