ఇది కదా మెగా అప్‌ డేట్ అంటే.. 

charan-10.jpg

ఆర్ఆర్ఆర్ తెచ్చిపెట్టిన క్రేజ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుకునేందుకు రామ్ చరణ్ మాములు పాట్లు పడట్లేదు. మధ్యలో ఆచార్య రిజల్ట్ కాస్త నిరాశ పరిచిన ఆ ఎఫెక్ట్ చెర్రీపై ఏమాత్రం పడలేదు. పైగా అదే టైమ్‌లో గేమ్ చేంజర్‌‌పై హైప్ ఒక రేంజ్‌లో లేసింది. అయితే రామ్ చరణ్‌ను, అలాగే దిల్‌రాజును తక్కువ అంచనా వేయలేం. ఈ మధ్యకాలంలో కథలో కొత్తదనం ఉంటేనే రామ్ చరణ్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే దిల్ రాజు సైతం స్టార్ డైరెక్టర్ కంటే ముందు కథకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ సినిమాకు సంబంధించిన పలు లీకులు సోషల్ మీడియాను మాములుగా ఊపడం లేదు. అందులో చరణ్ ఈ సినిమాలో త్రిబుల్ రోల్స్‌లో కనిపించబోతున్నాడని లీక్ మెగా ఫ్యాన్స్‌ కు ఎక్కడలేని ఆనందాన్నిస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చరణ్ త్రిబుల్ రోల్స్‌లో కనిపించడు కానీ మూడు షేడ్స్‌లో మాత్రం కనిపించబోతున్నాడు. తండ్రి అప్పన్నగా వైట్ అండ్ వైట్‌లో ఒక రోల్‌లో కనిపించగా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. అయితే కొడుకు పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. అందులో ఒకటి కాలేజీ కుర్రాడిగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడట. ఇక్కడే కియారాతో లవ్ ట్రాక్ ఉంటుందని సమాచారం. ఇక ఐఏఎస్ అయ్యాక పూర్తిగా తన లుక్‌ను చేంజ్ చేస్తాడని తెలుస్తుంది.

Share this post

scroll to top