తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, పిక్చర్ బ్యాంకు లోగోతో వాట్సప్ లో ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన కొద్ది గంటలకే సైబర్ నేరగాళ్లు పంపే లింకులను SMS, ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అనవసరంగా వచ్చే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. దీని ద్వారా సైబర్ నేరస్థులు గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ ద్వారా డబ్బులు దోచేస్తున్నారని తెలిపారు. అందుకే ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదన్నారు. మీ వాట్సాప్ పనిచేయకుంటే వెంటనే రీ ఇన్స్టాల్ చేసి రిపోర్ట్ ఆప్షన్ లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరస్థుల చేతిలో బాదితులైతే వెంటనే #1930 కీ కాల్ చెయ్యాలని లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చెయ్యాలని సీఐ రాంబాబు రైతులను కోరారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి..
