నల్లగొండజిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంగం డెయిరీ ప్రారంభోత్సవాన్ని చుట్టుపక్కల గ్రామాల పాడి రైతులు అడ్డుకున్నారు. డెయిరీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాత బకాయిలు చెల్లించిన తర్వాతే సంగం డెయిరీని ఓపెన్ చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. గతంలో అక్కడ నడిపిన వీటీ డెయిరీ సంస్థను బకాయిలు పడ్డ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల వేలం వేశారు. దానిని వేలంలో సంగం డెయిరీ దక్కించుకుంది. బుధవారం నూతన యాజమాన్యం డెయిరీని ప్రారంభించేందుకు సన్నద్ధం కాగా తమకు వీటీ డెయిరీ లక్షల రూపాయల పాత బకాయిలు చెల్లించాలని, ఆ తర్వాతే సంగం డైయిరీని ఓపెన్ చేసుకోవాలని పాడి రైతులు ఆందోళన చేపట్టారు. బ్యాంక్ అధికారులు, సంగం డెయిరీ యాజమాన్యం కుమ్మక్కై దొడ్డిదారిలో డైయిరీ ఫార్మ్‌ను చేజిక్కించుకున్నారని రైతుల ఆరోపించారు.
సంగం డెయిరీ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం..
