స్పిరిట్ కు ముందుగా బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ని ప్రభాస్ కి జోడిగా అనుకున్నారు, కానీ ఇప్పుడు దీపికా పదుకొనే అయితే బాగుంటుందని ఆమెను కలిసినట్లు తెలుస్తుంది. సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా సిజ్లింగ్ బ్యూటీ భారీస్థాయిలో పారితోషకం డిమాండ్ చేసిందట. దీపికా నటించిన పఠాన్, కల్కి లాంటి వేయికోట్ల వసూళ్ల సినిమాతో ఆమెకు మాంచి పాపులారిటీ వచ్చింది. ఇవన్నీ చూసే తన రెమ్యునిరేషన్ రూ. 20కోట్లకు తగ్గదని చెప్పడంతో టిసిరీస్ భూషన్ కుమార్ అవక్కయ్యాడట. ఫైనల్ గా రూ. 18 కోట్లకు దీపికా లాక్ అయినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కు స్పిరిట్ సినిమాలో చేస్తున్నందుకు రూ. 150కోట్లకు తగ్గకుండా పారితోషకం అందబోతుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న దర్శకుడు సందీప్ ఏ విషయంలోను తగ్గే రకం కాదు కాబట్టి జూన్ మిడ్ నుంచి మొదలయ్యే ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చయినా పెట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రెబల్ స్టార్ కనిపించనుండడంతో షూటింగ్ కూడా కాకుండానే ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దీపికా పదుకొణె డిమాండ్..
