పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు భద్రతా దళాలు సైరన్ల ఏర్పాటు చేశారు. సైరన్లు మోగించి పౌరులను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక, ఐటీఓ PWD ప్రధాన కార్యాలయం దగ్గర వైమానిక దాడి సైరన్లు పౌర రక్షణ డైరెక్టరేట్ ఏర్పాటు చేసింది. వైమానిక దాడి సైరన్ ను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ పరిశీలించారు. సమారు 8 కిలో మీటర్ల వరకు వినిపించేలా సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు. వైమానిక దాడులు జరిగితే, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో సైరన్లు ఏర్పాటు చేశారు. సుమారు 15 నుంచి 20 నిముషాల పాటు ఈ సైరన్లు మోగనున్నాయి. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సంయక్తంగా ఈ రిహార్సల్స్ చేపట్టింది.
పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం వేళ ఢిల్లీలో హై అలర్ట్..
