రైతులకు అదిరే శుభవార్త.. 

ravanth-9.jpg

తెలంగాణ రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని దశల వారిగా అమలు చేస్తోంది. మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతులకు బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేసింది. రెండో విడతలో లక్షన్నర లోపు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేసింది.మూడో విడత రుణమాఫీని ఆగస్ట్ లూపే చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

రెండు విడతలుగా రూ.12,289 కోట్లు రుణమాఫీ చేశాం. రూ.లక్షన్నర వరకు రుణం ఉన్న వారికి నేరుగా అకౌంట్లలో డబ్బులు వేశాం. రెండు విడతల్లో కలిపి 16 లక్షల 29 వేల కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. మూడో విడత రుణమాఫీని ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా, జులై 18న తొలివిడతగా రూ. లక్షలోపు రుణాలను, జులై 30 రెండో విడత రూ.లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేశారు. మెుత్తం 6.40 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6.190 కోట్లు జమ చేశారు. రెండు విడతల్లో కలిపి మెుత్తం 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు జమ చేశారు. మూడో విడతలో మరో 20 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Share this post