జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు, రెండు సాంగ్స్ సినిమాని వేరే లెవెల్ లోకి తీసుకు వెళ్ళగా ఇప్పుడు థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్లు. దావుడి అని సాగనున్న ఈ సాంగ్ సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది.
ఇక రెడీ అవండి..
