డయాబెటిస్ రోగులకు అలర్ట్..

helth-31.jpg

డయాబెటిస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది డయాబెటిస్ బారినపడుతున్నారు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం వాస్తవానికి మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వస్తే అది జీవితాంతం ఉంటుంది. డయాబెటిక్ రోగులు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే నిర్వహణ కష్టం అవుతుంది. డయాబెటిస్ లో ఏ రకమైన నిర్లక్ష్యం కూడా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. సాధారణంగా ప్రజలు తమ అనారోగ్యకరమైన జీవనశైలి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు.

శారీరక శ్రమ లేకపోవడం:

శారీరకంగా చురుకుగా ఉండటం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇది డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడుతుంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ నడవడం, జాగింగ్ చేయడం లేదా యోగా చేయడం మంచిది. 

తగినంత ఫైబర్ తీసుకోకపోవడం:

ఫైబర్ అనేక విధాలుగా మీ ఆరోగ్యానికి ముఖ్యమైనది.. ఇది మధుమేహం నిర్వహణలో కూడా సహాయపడుతుంది. ఫైబర్-ఆధారిత ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గట్‌ను ప్రోత్సహిస్తుంది.

Share this post

scroll to top