ఈ రోజుల్లో షుగర్ వ్యాధి సాధారణం అయిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. రోజురోజుకు మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది.అయితే ఈ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో పండ్లు కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నప్పుడు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ముఖ్యంగా, ఈ వ్యాధిలో చాలా తీపి పదార్థాలు లేదా తీపి పండ్లు తినకూడదు.కొన్ని పండ్లను తినడం వల్ల షుగల్ స్థాయి పెరుగుతుంది. అరటిపండు వల్ల అనేక లాభాలున్నాయి. ఈ పండు చాలామంది ఇష్టంతో తింటారు. అయితే అరటిపండులోని లక్షణాల వల్ల రక్తంలో చక్కెర సులభంగా పెరుగుతుంది, ఇది డయాబెటిక్ రోగులకు ప్రాణాంతకం. ద్రాక్ష తీపిగా పుల్లగా ఉంటాయి. అయితే ఈ పండులో సహజ చక్కెరలు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్ల సమస్య పెరుగుతుంది. డయాబెటిక్స్ రోగులు పైనాపిల్‌ను పరిమితంగా తినాలి. ఇది రక్తంలో చక్కెర లెవల్స్‌ను పెంచుతుంది. అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇది రక్తంలో త్వరగా కరుగుతుంది. గ్లూకోజ్‌ని పెంచుతుంది. పైనాపిల్ షుగర్ స్పైక్‌ను వేగంగా పెంచుతుంది. దీన్ని తినడం వల్ల ఆకలి పెరగడంతోపాటు తరచుగా మూత్రవిసర్జన కూడా వస్తుంది.
ఈ పండ్లు షుగర్ ఉన్నవారికి ప్రాణాంతకం..
