నీల్ ఎన్టీఆర్ కు కండిషన్ పెట్టాడా..

ntr-leel-11.jpg

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా దేవర. ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో రన్ అయిన దేవర మూవీ ఆ తర్వాత రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనే ఉంది. వాటిలో ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం మనకి తెలిసిందే. 2025 జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నెటిజెన్స్ ముందుగానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఒక కండిషన్ పెట్టాడని తెలిసిన సమాచారం. ప్రస్తుతం, జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు పెరగాలని చిన్న కండిషన్ పెట్టినట్టు తెలిసింది. దీని కోసం ప్రత్యేక డైట్ ను ఫాలో అవ్వనున్నాడు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కు బరువు పెరగడం కొత్తేమి కాదు.

Share this post

scroll to top