బాలీవుడ్ బడా స్టార్స్ చూపులన్నీ సౌత్ వైపే..

alliya-12-1-1.jpg

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ మరో సౌత్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ట్రిపులార్‌తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఇప్పుడు మరో పాన్ ఇండియా డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఉన్న ఆలియా భట్‌, ట్రిపులార్‌తో సౌత్ ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ కావటంతో చిన్న పాత్రే అయినా నటించేందుకు ఓకే చెప్పారు ఈ క్యూటీ.

ట్రిపులార్‌లో ఆలియా పాత్రకు మంచి రెస్పాన్స్ రావటం, ఆ ఇమేజ్‌ ఆమె మార్కెట్‌ కు కూడా హెల్ప్ అవ్వటంతో సౌత్‌ లో రెగ్యురల్‌గా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు ఈ బ్యూటీ. తాజాగా మరో పాన్ ఇండియా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ సినిమాలో ఆలియా నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ కథతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్న నాగీ, ఆ సినిమాలో లీడ్ రోల్‌ కు ఆలియాను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కల్కి 2ను పట్టాలెక్కించడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుంది. అందుకే ఈ లోగా ఆలియాతో ఓ మూవీని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Share this post

scroll to top