కళ్ల ముందు ఎంతటి విషయం జరిగినా మన మెంటాలిటీ మాత్రం నెక్స్ట్ ఏంటి? అనే ధోరణిలోనే ఉంటుంది. దేవర థియేటర్లలోకి దూసుకొచ్చిన ఈ టైమ్ లోనూ సినీ ప్రేక్షకుడి మనసు నెక్స్ట్ ఏంటి అనే అడుగుతోంది. ఆ మాట ఇలా మెదలగానే అందరి చూపులూ పుష్ప సీక్వెల్ మీద ల్యాండ్ అవుతున్నాయి. పుష్పరాజ్ సీక్వెల్‌లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 6న వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు మేకర్స్.
చెప్పిన టైమ్‌కి పుష్ప సీక్వెల్ వస్తుందా? రాదా? అనే అనుమానాలు అసలు ఉండకూడదని రిపీటెడ్‌గా రిలీజ్ డేట్‌ని కన్‌ఫర్మ్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా పుష్ప సెట్స్ ని విజిట్ చేశారు జక్కన్న. ఆయన రాకతో పాజిటివ్ వైబ్స్ అమాంతం పెరిగాయంటూ అభిమానం చాటుకున్నారు సుకుమార్. తనకు ఇష్టమైన డైరక్టర్ సుకుమార్ అని ఇప్పటికే చాలా సార్లు చెప్పేశారు జక్కన్న. దాంతో ఈ రీసెంట్ విజిట్ క్షణాల్లో వైరల్ అయింది. పుష్ప 2 ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడందుకున్నాయి. ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.