ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ హీరోయిన్..

heroin-03.jpg

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె రిచ్చెస్ట్ హీరోయిన్. ఆ బ్యూటీ ఆస్తులు ఏకంగా రూ.4600 కోట్లు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అగ్రకథానాయికగా దూసుకుపోయింది. అలాగే అప్పట్లో ఆమె అందం, అభినయంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడు సినీరంగంలో అత్యధిక ధనిక నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. హిందీలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్, కాజోల్ వంటి కథానాయికలతో కలిసి పనిచేసింది.

అప్పట్లో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలోనే స్టార్ స్టేటస్ అందుకున్న జూహీ చావ్లా కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇదిలా ఉంటే మన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే హురున్ ఇండియా సంస్థ గతేడాదికు గానూ విడుదల చేసిన జాబితాలో సినిమా హీరోయిన్లలో జూహి చావ్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు. ఇక ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ ఆస్తులు రూ.7300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా హీరోయిన్లలో జూహి చావ్లా ఉంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్ 2000, నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్ 1200 కోట్లతో ఉన్నారు.

Share this post

scroll to top