రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో లక్షలాది అన్నదాతలకు ‘రైతు భరోసా’ ను ఆపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాలో మాట్లాడుతూ రైతు భరోసా పథకం ఎన్నికల కోడ్ కంటే ముందే జనవరి 26 ప్రారంభమైందని కొనసాగుతోన్న పథకమే ప్రభుత్వం రైతులు పొట్ట కొట్టొద్దని కామెంట్ చేశారు. కేవలం ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం అన్నారు.
ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్మును సర్కార్ ఎగ్గొటిందని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఇళ్లల్లోని కుటుంబాలను ప్రమాణికంగా తీసుకోవాలని సూచించారు. ఒకవేళ రైతు భరోసా నిధుల విడుదలలో ఎన్నికల కోడ్ తో సమస్య వస్తే అవసరమైతే బీజేపీ తరపున ఈసీకి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అందరం కలిసి ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.