డబుల్ ఇస్మార్ట్’ లో ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్‌ల డైనమిక్ క్లాష్ ను పవర్ ఫుల్ గా ప్రెజెంట్స్ చేస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈ ఈసినిమాకు రవితేజ సినిమాకు పోటీ కాదు. ఆలా అని వాయిదా పడదు. నో డౌట్ ఆగస్టు 15నే డబల్ ఇస్మార్ట్ రిలీస్ అవుతుంది అని డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెలియజేస్తున్నారు. ఈ మూవీకి రామ్ పోతినేని తన డబ్బింగ్‌ను నేడు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ డబ్బింగ్ సెషన్ నుంచి వీడియోను విడుదల చేశారు. కొత్తగా రిలీజ్ చేసిన క్లిప్‌లో, రామ్ తన క్యారెక్టర్ మాస్ అప్పీల్‌ను హైలైట్ చేసే పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌ను చెప్పారు. ‘మామ… మాస్క్ ఉంటె నీకు దొంగోడు మాత్రమే కనపడతడు… మాస్క్ లేకుంటే నీకు మి*డెడు కనపడతడు …”అంటూ రామ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ డైలాగ్ మూవీలో రామ్ హై-ఆక్టేన్, లార్జర్ దేన్-లైఫ్ క్యారెక్టర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాన్-ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. పాటలు, టీజర్ థంపింగ్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
డబుల్ ఇస్మార్ట్ మెడకు చిక్కుముడులు..
