రీఫ్రెషింగ్ డ్రింక్ తాగితే ఆరోగ్యం..

drenk-25.jpg

చాలామంది ఉదయం నిద్ర లేచి బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగుతారు. అయితే ఇవి కాకుండా ఒక రీఫ్రెషింగ్ డ్రింక్ తాగితే ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఆయుర్వేద డ్రింక్ మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తూ బెల్లీ ఫ్యాట్ను తగ్గిస్తుంది. నిమ్మరసంలో పసుపు వేసి తయారు చేసే ఈ లెమన్ టర్మిరిక్ వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం నిమ్మరసం, కొంచెం పసుపును గోరు వెచ్చని నీళ్లలో కలిపి ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన టేస్ట్ కోసం నిమ్మరసం, పసుపు మోతాదును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయం లెమన్ టర్మిరిక్ వాటర్ తాగితే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గవచ్చు. దీనితో మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ C శరీరంలోని కేలరీలు మరింత వేగంగా బర్న్ అయ్యేలా చేస్తుంది. పసుపులో ఉండే కొన్ని థర్మోజెనిక్ లక్షణాలు శరీర ఉష్ణోగ్రతను కొద్దిగా పెంచి, తినే ఆహారాన్ని త్వరగా శక్తిగా మార్చుతాయి. దీంతో బరువు తగ్గే ప్రయోజనాలు లభిస్తాయి. ఈ డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల తరచుగా ఆకలి వేయదు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది.

Share this post

scroll to top