రేవంత్ రెడ్డి సర్కారుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణల చేశారు. పదవులు ప్రజలు పెట్టే బిక్ష అని.. కొద్ది కాలానికే కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని.. పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. అతి తక్కువ టైమ్ లో అతి ఎక్కువ అక్రమ సంపాదనకు రేవంత్ సర్కారు పాల్పడిందన్నారు. ఆర్ ఆర్ ట్యా్క్స్ గురించి ప్రధాని మోడీ మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటూ వాక్యాలు చేశాడు.
రేవంత్ సర్కారుపై ఈటల సంచలన ఆరోపణలు..
