సోడాలు, వివిధ రకాల కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవే కాకుండా, పండ్ల రసాల వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ గాల్వే, మెక్‌మాస్టర్ యూనివర్శిటీ, కెనడా నిపుణులు, అంతర్జాతీయ స్ట్రోక్ నిపుణుల బృందం చేసిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది. రోజుకు రెండు లేదా మూడుసార్లు పండ్ల రసాలను తాగితే, ఈ ప్రమాదం రెట్టింపు అవుతుందని పేర్కొంది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జ్యూస్‌లు “పోషక విలువలు లేని చక్కెర సిరప్‌లు అని అన్నారు. ఇది స్ట్రోక్ వచ్చే అవకాశాలను 37 శాతం పెంచుతుందని.. పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
పండ్ల రసాలు స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా పెంచుతాయి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జ్యూస్‌లు తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనం ఫైబర్ లేకపోవడం. ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మీ ప్రేగు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుతుంది. పండ్ల రసం తక్షణమే చక్కెరను విడుదల చేస్తుంది. అన్ని పండ్ల రసాలు ఒకేలా ఉండవు.. చేతితో పిండి చేసిన పండ్ల రసాలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ఎక్కువ చక్కెర, నాణ్యత లేని పండ్లతో చేసిన పండ్ల రసాలు హానికరం. ఇది స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.”అని ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ ఆండ్రూ స్మిత్ అన్నారు. అయితే స్ట్రోక్ సమస్యను తగ్గించడానికి వైద్యులు ఎక్కువ నీరు త్రాగమని సలహా ఇస్తారు.