హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తుండటంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు రద్దీగా మారాయి. ముఖ్యంగా బషీర్‌బాగ్, బర్కత్‌పుర, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగుడ ప్రాంతాల నుంచి గణనాథులు నిమజ్జనానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు క్యూ కట్టాయి. ఇక ఓల్డ్ సిటీ నుంచి వచ్చే గణనాథులతో బషీర్‌బాగ్‌లోని బాబుజగ్జీవన్‌రావు విగ్రహం వరకు క్యూ కొనసాగుతోంది. దీంతో గణేష్ నిమజ్జనాలు ఇవాళ సాయంత్రం వరకు ముగిసే అవకాశం ఉందని పోలీసుల ఉన్నతాధికారులు తెలిపారు.
రెండో రోజు కూడా బారులు తీరిన గణనాథులు..
