సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ..

cm-16-.jpg

వీరంతా స్థానికంగా ఉపాధి లభించక, విధిలేని పరిస్థితులలో కుటుంబ సభ్యులకు దూరం కావటంతో మానసికంగా కృంగిపోతు, బలవన్మరణాలకు పాల్పడటం, అనారోగ్యాలకు, ప్రమాదాలకు గురి అవుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితులలో ఇటువంటి కుటుంబాలను ఆదుకొనుట ప్రభుత్వ బాధ్యతగా భావించక తప్పదని అన్నారు. వాస్తవంగా ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు 15 లక్షల కుటుంబాలపైన గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్నట్టు భావించినా.. వారి నుంచి కనీసం రూ.18 వేల కోట్లు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందని లేఖ ద్వారా తెలియజేశారు.గల్ఫ్ బాధితుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు, గల్ఫ్ లో ఉపాధి పొందుతున్న వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర పథకాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ లేఖలో.. ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తెలంగాణ జిల్లాల నుండి నిరుద్యోగ యువత ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలపై ఆధారపడటం సహజంగా వస్తుందని, ఒకవిధంగా చెప్పాలంటే, దాదాపు 10 శాతం వరకు నిరుద్యోగ యువకులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నారని చెప్పారు.

Share this post

scroll to top