ఇటీవల రాజమౌళి మహేష్ పాస్పోర్ట్ లాక్కున్నట్లు సింహాన్ని బోన్లో వేసినట్లు పెట్టిన ఓ పోస్ట్ అందరిలో క్యూరియాసిటీని పెంచింది. అయితే సినీ ప్రియులంతా ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘SSMB-29’లో విలన్గా మలయాళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అతను స్పందించి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించనట్టుగా ఈ బ్యూటీ ఈ సినిమాలో లేడీ విలన్గా కనిపిస్తుందట. అంతేకాదండోయ్ అందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే హీరోయిన్గా కూడా బాలీవుడ్ బ్యూటీనే తీసుకునేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్గా మారగా అబ్బో జక్కన్న పెద్ద ప్లానే చేశాడుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.