తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఆరు గ్యారెంటీలనే చెప్పవచ్చు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. ముందుగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. తర్వాత ప్రజా పాలన పేరిట డిసెంబర్ చివరి వారంలో దరఖాస్తులను ఆహ్వానించారు. వీటి ద్వారా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు లాంటి పథకాలను అమలు చేశారు. అయితే దరఖాస్తుల్లో చాలా వరకు తప్పలు దొర్లడంతో చాలా మంది ఈ పథకాలను దూరం అయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సీపీఓ కార్యాలయంలో ఇటీవల కలెక్టర్ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. దరఖాస్తులో తప్పుల కారణంగా చాలా మంది పథకాలకు దూరం అయ్యారని.. వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వీరు తమ వెంట ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లుల జిరాక్స్ లు తీసుకొని ప్రజాపాలన సేవా కేంద్రంలో సవరణ చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తులో తప్పుల కారణంగా చాలా మంది పథకాలకు దూరం..
