హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. కానీ అందరిలాగే కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడింది. కొన్ని సినిమాలు చేతిదాకా వచ్చి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టపడి ఎదుగుతుంటే చూసి ఓర్వలేనివారు ఆమెకు యాక్టింగ్ రాదని, లుక్స్ బాగోవని విషప్రచారం చేసేవారు. ఈ విషయాన్ని దర్శకుడు గుడ్డు ధనోవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘సన్నీ డియోల్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా 2002-2003 మధ్యలో ఓ సినిమా తీశాను. అప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్ జరిపాం. ప్రియాంకకు యాక్టింగ్ అంతగా రాకపోయేది. ఇప్పుడీ సీన్ ఎలా చేయాలి? ఈ సన్నివేశం గురించి కాస్త వివరించరా? అని అడిగి మరీ తెలుసుకుని నటించేది. నేర్చుకోవాలన్న తపన తనలో కనిపించేది. తన పాత్రను పర్ఫెక్ట్‌గా చేయాలని భావించేది. అలాగే అందంగా కూడా ఉండేది. ఓ షెడ్యూల్ పూర్తయ్యాక ప్రియాంక గురించి ముంబైలోని కొందరు నెగెటివ్‌గా చెప్పడం మొదలుపెట్టారు. స్క్రీన్‌పై తను అంత అందంగా కనిపించదని, యాక్టింగే రాదని, టైం వేస్ట్ చేసుకోవద్దని, కావాలంటే ఇప్పటివరకు షూట్ చేసిన భాగాన్ని ఓసారి చూసుకోమని సలహాలు ఇచ్చారు.
సన్నీ డియోల్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా..
