కాంగ్రెస్ మార్పంటే హాస్టళ్లకు, కాలేజీలకు తాళాలు వేయడమేనా..

harish-rao-30.jpg

కాంగ్రెస్ పాలనలో మొన్నటివరకు సంక్షేమ హాస్టళ్లకు తాళాలు వేస్తే నేడు ప్రభుత్వ వైద్య కాలేజీలకు వేస్తున్నారని ఇదేనా రేవంత్ సర్కార్ తెచ్చిన మార్పు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగళపల్లిలోని మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి అద్దె చెల్లించలేదని యజమానులు బిల్డింగ్‌కు తాళం వేయగా..ఈ ఘటనపై హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలం అయ్యిందన్నారు.కాగా,భారత్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో గతేడాది ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది. కొన్ని నెలలుగా అద్దె చెల్లించలేదని యజమానులు మంగళవారం తాళాలు వేశారు.నిన్న ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు తాళాలు ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రెండు రోజుల్లో అద్దె చెల్లిస్తామని నచ్చజెప్పడంతో మళ్లీ తాళాలు తీసినట్లు తెలిసింది.

Share this post

scroll to top