అస్తవ్యస్తంగా తయారైన పారిశుధ్యం..

ppower-22.jpg

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రామం పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. నేడే ఆ కార్మికులకు జీతాలే కరువయ్యాయని తెలిపారు. కేసీఆర్ హాయాంలో ప్రతినెలా పంచాయతీల రూ.275 కోట్లు టంచన్ విడుదల చేసేవాళ్లమని అన్నారు. మార్చి కంటే ముందు కేంద్రం రూ.500 కోట్లు పంచాయతీలకు విడుదల చేసిందని, అదే రాష్ట్రంలో ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదని అన్నారు. దాదాపు రూ.2,500 కోట్ల రాష్ట్రం‌లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్లే పథకాలపై ప్రభావం పడిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభం కోట్టుమిట్టాడుతోందని, కరెంట్ కోతలకు ప్రభుత్వం చిత్ర విచిత్ర కారాణాలు చెబుతోందని అన్నారు. కరెంట్ బిల్లులు కట్టలేదంటూ గ్రామ పంచాయతీలు, ప్రభుత్వం పాఠశాలలకు సర్వీసును తొలగిస్తున్నాని ఫైర్ అయ్యారు. చివరకు పోలీసుల వాహనాలకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.

Share this post

scroll to top