పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.. అబ్బ ఇదెక్కడో విన్నాం అనుకుంటున్నారా.. ఇది మన పెద్దలు తరచూ వాడే సామేత.. ఎవరి రుచులు వారివి.. మనుషులు అందరూ ఒక్కటి కాదు.. ఎవరి బుద్దులు వారివి.. అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.. మనిషి ఆలోచనలు.. ప్రవర్తనలు వేరు వేరుగా ఉంటాయి. అందరిలా ఆలోచిస్తే మన ప్రత్యేకత ఏముంటుంది.. అలాగే ప్రతి ఒక్కరికీ.. ఒక్కో రుచి నచ్చుతుంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి ముందుకెళ్తే.. పిజ్జాలు, బర్గర్లు, పానీపూరి, కబాబ్స్, షావర్మా.. అబ్బో ఇలా ఎన్నో టేస్ట్ చేయడానికి ట్రెండీ ఆహార పదార్థాలు ఉన్నాయి.. ముఖ్యంగా పానీ పూరి బండి కనిపించినా.. షావర్మా షాపు కనిపించినా చాలా మందికి నోరురుతుంది.. ఇంకేముంది.. అక్కడికి వెళ్లి లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తుంటారు.. అయితే.. అలాంటి వారికి మనం ఎన్ని చెప్పినా ఎక్కదు గాక ఎక్కదు.. ఎందుకంటే.. మేం తింటున్నామని అలా అంటున్నారు.. అంటూ సింపుల్ గా చెప్పేస్తారు.. కానీ.. ఇప్పుడు చెప్పబోయేది తెలిస్తే.. ఒక్కసారిగా గుటకలేస్తారు.. ఎందుకంటే.. జనం రోడ్ల వెంట ఇష్టంగా తినే కబాబ్స్, పానీపూరిలతో పాటు షావర్మాలతో ప్రాణాంతక బ్యాక్టీరియా, ఈస్ట్ ఫంగస్- పులిసి పోయిన ఆహారంపై ఉండే బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది.
షావర్మా.. తింటే మీ కర్మ ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో దడపుట్టించే నిజాలు..
