యాలకులలో ఉన్నటువంటి ఆల్కలైన్ ప్రభావం వలన ఎసిడిటీ తగ్గుతుంది, ఛాతిలో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాలకులలో పుష్కలంగా ఉంటాయి. దీని వలన కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి,గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. యాలకులను రెగ్యులర్‌గా తీసుకోవడం వలన కేలరీలు కరిగిపోతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు యాలకులలో సమృద్దిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. భోజనం తర్వాత యాలకులు నమలడం వలన నరాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. దీని వల మంచి నిద్ర కలుగుతుంది.
యాలకులలోని యాంటీమైక్రోబాక్టీరియల్ గుణాల వలన ఓరల్ బాక్టిరీయాతో పోరాడే శక్తి లభిస్తుంది, దీని వలన తాజా శ్వాస లభిస్తుంది. యాలకులు తినడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది. యాలకులు శరీర జీవక్రియలను నెమ్మదిగా పెంచుతాయి. రోజు రెండు యాలకులు తినడం వలన జీర్ణ ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే థర్మోజెనిక్ గుణాలు శరీరంలో క్యాలరీలను సమర్థంగా కరిగించేస్తాయి. రాత్రివేళ యాలకులు తింటే బరువు తగ్గడానికి దోహదపడతాయి. యాలకులు చర్మం, జుట్టు విషయంలోనూ మేలుచేస్తాయి. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. దీంతో చర్మం మెరిసేలా కాంతివంతంగా తయారవుతుంది. యాంటి బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలపై పోరాడతాయి. యాలకుల్లో ఉండే పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. చుండ్రును నివారిస్తాయి.