సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

kavatha-27.jpg

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ క‌విత‌ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిష‌న్‌పై నేడు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆమె త‌ర‌ఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించ‌నున్నారు. ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే న‌మ్మకం బీఆర్ఎస్ నాయ‌క‌త్వంలో ఉన్నది. దీంతో బీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రమే కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంత మంది సోమవారం వెళ్లగా, ఇంకొంత మంది మహిళా నేతలు, సీనియర్లు, ఎమ్మెల్యేలు మంగళవారం వెల్లనున్నట్టు సమాచారం. బెయిల్‌పై కవిత విడుదల కాగానే ఆమెకు స్వాగతం పలికేందుకు వీరంతా వెళ్లినట్లు తెలిసింది.

Share this post

scroll to top