తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పైకి వెళ్లేకొలది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం రెండురోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఐదురోజులు తెలంగాణలో భారీ వర్షాలు..
