నేడు14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం..

jarkand-28.jpg

జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్‌ ముక్తిమోర్చా ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, ఎన్‌డీఏ 24 సీట్లు దక్కించుకున్నాయి. ఈ ఎన్నికల్లో హేమంత్‌ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ సైతం గెలిచింది. ఆదివారం నాడు హేమంత్‌ సోరెన్‌ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాందీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత, మేఘాలయ సీఎం కొన్రాడ్‌ సంగ్మా, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, హిమాచల్‌ ప్రదేశ్ సీఎం సుఖీ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో పాటు సీపీఎం జనరల్‌ సెక్రటరీ దీపాంకర్‌ భట్టాచార్య, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే,, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తదితరులు హాజరవుతారు.

Share this post

scroll to top