సిరిసిల్ల కలెక్టర్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

court-03.jpg

కోర్టుకు హాజరవుతారా? జైలుకు పంపమంటారా? అంటూ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు. హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించారని జిల్లా కలెక్టర్ పై ఆరోపణలు ఉన్నాయి. తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడన్ని తీవ్రంగా పరిగణించింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.

తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు రాజన్నసిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు. సుదీర్ఘ కాలం విచారణ అనంతరం కవితకు అర్అండ్ఆర్ ప్యాకేజి ప్రకారం పునరావాసం కల్పించాలని తీర్పునిచింది న్యాయస్థానం. కోర్టును తప్పుతోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ ఆర్డీవోకు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారట కలెక్టర్.

Share this post

scroll to top