మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అయితే నేడు తీర్పు వెలువడుతుందని అనుకున్నప్పటికీ తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేసారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే ఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ ఉందని న్యాయవాది తెలిపారు. పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదని చెన్నమనేని తరపు న్యాయవాది తెలిపారు.
చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వాయిదా..
