చలికాలంలో పెదవులు పగిలియా..

lips-08.jpg

చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, సహజమైన మాయిశ్చరైజర్లను ఉపయోగించడం, అలాగే ఆయుర్వేద ఆయిల్స్ పెదవులకు ప్రత్యేక శ్రద్ధను ఇచ్చి వాటిని మృదువుగా చేయవచ్చు.

ఇలా పెదాలను మృదువుగా ఉంచుకుందేకు కొన్ని ఇంటి నివారణలను ఉపయోగిస్తే కొద్దివార్కు మేలుకరంగా ఉంటుంది. ఇంట్లో ఉండే నెయ్యి, వెన్న రెండు మంచి మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. వీటి సహాయంతో పెదవులకు తేమను అందించి, చలికాలంలో వాటిని మృదువుగా ఉంచుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పెదవులపై నెయ్యి లేదా వెన్న రాసుకోవడం మంచిది. అలాగే తేనె సహజమైన హైడ్రేటర్‌గా పనిచేస్తుంది. దీనికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. పెదవులపై తేనె రాసి కొద్దిసేపటి తర్వాత కడిగేయండి. ఇది పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో పెదవులను నయం చేయడంలో సహాయపడతాయి. శీతాకాలంలో కొబ్బరి నూనెను రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు ఉపయోగించడం మంచిది. 

Share this post

scroll to top