ఋషికొండ పై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనాల్లా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అమరనాథ్ సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించామని, ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంలో రుషికొండ భావనలను వినియోగించుకోవాలని, రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఉండరని అమరనాథ్ అన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారని, ఆ కమిటీ నివేధిక ఇచ్చిన తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని తెలిపారు. టీడీపీ నేతలు జగన్‌పై, ఆయన కుటంబంపై బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఋషికొండపై టీడీపీ నేతల తప్పుడు ప్రచారం..
